
ఈ ప్రమాద కారణంగా కూడా కొంతమంది మరణించారు . దీంతో మొత్తం మరణాల సంఖ్య 275 కు పైగానే పెరిగిపోయింది . ఈ ఘటన అందరి గుండెలను తడిపేసింది . కాగా అటువంటి పరిస్థితుల్లోనూ ఘటన స్దలికి వెళ్లి మానవత్వాన్ని నిజాయితీని చాటుకున్నాడు ఒక వ్యక్తి. అక్కడ పడిపోయిన హ్యాండ్ బ్యాగులు.. దుస్తులు ..అలాగే అక్కడ దొరికిన బంగారం అంతా కూడా పోలీసులకు అప్పగించేసాడు . దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
రీసెంట్గా లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. కాగా ఆ ప్రమాదంలో దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు 50వేల రూపాయలు నగదు కొన్ని అమెరికన్ డాలర్లు పాస్పోర్ట్ లు అలాగే భగవద్గీత పుస్తకం లాంటి అనేక విలువైన వస్తువులు కూడా దొరికాయి . వాటిని పోలీసులకి అప్పగించేసాడు రాజేష్ పటేల్ . ప్రమాదం జరిగిన సమయంలో కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్న రాజేష్ పటేల్ పేలుడు శబ్దం వినగానే అక్కడికి వెళ్ళాడు కానీ మంటలు ఘోరంగా ఉన్నాయి . అందుకే అతడు ముందుకు వెళ్లడానికి సాహసం చేయలేకపోయాడు.
ఆ తర్వాత రాజేష్ పటేల్ సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాడు . ఆ సమయంలోనే రాజేష్ పటేల్ కు సుమారు 70 తులాల బంగారు ఆభరణాలు 50వేల రూపాయలు నగదు అదే విధంగా హ్యాండ్ బ్యాగులు ..కాస్ట్లీ వస్తువులు .. అమెరికన్ డాలర్లు అన్ని కనిపించాయి ఇవన్నీ కూడా పోలీసులకు అప్పగించేసాడు . 2008 అహ్మదాబాద్ పేలుళ్ల సమయంలోను వాలంటీర్ గా సేవలు అందించారు రాజేష్ పటేల్. దీంతో రాజేష్ పటేల్ నిజాయితీని అందరూ పొగిడేస్తున్నారు. అయితే ఇప్పుడు జనాలకు ఒక బిగ్ డౌట్ వచ్చేసింది. ప్రమాదంలో చనిపోయిన వారి వస్తువులు ఇవి అని ఎలా గుర్తిస్తారు..? 70 తులాల బంగారు ఆభరణాలు వచ్చాయి ..? మరి అవి ఎవరివి అని ఎలా ఐడెంటిఫై చేస్తారు..? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు . అయితే ఇదే మూమెంట్లో కొంతమంది నెటిజన్స్ క్లారిటీ ఇస్తున్నారు . వాళ్ళ వాళ్లని పిలిచి క్లారిటీ తీసుకుంటారేమో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!