
దీంతో పిల్లలు అక్కడ చాలా భయపడుతూ టెన్షన్ పడుతున్నారు . పక్కనే ఉన్న పిల్లలు భయపడుతున్న కూడా భార్య భర్తలు ఏమాత్రం ఆలోచించకుండా గట్టిగా అరుచుకుంటున్నారు . అంతేకాదు వీడియోలో భర్త కోపంగా భార్యను లాగిపెట్టి కూడా కొట్టాడు . దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీనిపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు వాడు మనిషేనా..? అంటూ తిట్టి పోస్తున్నారు. చివర్లో భార్య గొంతు నొక్కిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయ్. ఆ వెంటనే వీడియో కట్ అయిపోతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది .
భర్త అలా భార్యని ఎందుకు కొడుతున్నాడు..? అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ భర్తకు సిగ్గు లేదా..? అసలు భార్యను కొట్టడం ఏంటి..? పైగా పిల్లలు ముందు కొడుతున్నాడు.. వాడు మనిషేనా ..?కడుపుకు తిన్నది అన్నమేనా..? అంటూ ఘాటుఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు . అంతే కాదు కొంతమంది ఆ ఇద్దరు పిల్లల గురించి కూడా బాధపడుతున్నారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా కొట్టుకుంటూ అర్చుకుంటే.. వాళ్ళ మనసు ఎంత నొచ్చుకుంటుంది..? వాళ్ళ మైండ్లో అలా ఆ విషయాలు పాతుకుపోతాయి.. అంటూ తల్లిదండ్రులు ఇలా చేయద్దు దయచేసి పిల్లలు ముందు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఆ మహిళ తరువాత సూసైడ్ చేసుకుని మరణించిన్నత్లు తెలుస్తుంది. అదనపు కట్నం కోసం ఇలా ఆ మొగుడు టార్చర్ చేశారంటూ ఓ విషయం బయటపడ్డింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు..!