జగన్ సర్కారు పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం మంజూరు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై తాజాగా సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. మహిళకు గుడ్ న్యూస్ చెప్పారు.


అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం మహిళ పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామని వివరించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయం డిస్‌ప్టేలో పెట్టాలని అధికారులకు సూచించారు.


ప్లాట్ల నిర్వహణ వల్ల ప్రజలకు చాలా సమస్యలు వస్తాయని, ఇండిపెండెంట్‌గా ఇల్లు నిర్మించి ఇస్తే ఎవరికి వారే తమ ఇంటిని భద్రంగా చూసుకుంటారన్నారు. కాల్వ గట్లు, నదీ తీర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇళ్లు కట్టించి వారిని తరలించాలని సూచించారు. ఇలాంటి వారి కోసం సుమారు 5 లక్షల ఇళ్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది.


సో.. కొత్తగా ఇచ్చే ఇళ్లన్నీ మహిళల పేరు మీదే ఇస్తారట. ఇకపై ఆ ఇళ్లకు వారే రాణులన్నమాట. మహిళలకు జగన్ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: