ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్... ఈ పేరు చెప్తే గుర్తు పట్టడం కొంచం కష్టం కానీ ఇస్రో అనే వాడుక బాషా లో చెప్తే ఇట్టే గుర్తు పట్టేస్తాం. భారత దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకొని విధంగా ఇస్రో ఎన్నో ప్రయోగాలు చేపట్టి సక్సెస్ అయ్యి చూపించింది. అలాంటి ఇస్రో లో తొలి మహిళా శాటిలైట్ ప్రాజెక్టు డైరెక్టర్ గా నియామకం చేయబడ్డ సీనియర్ మోస్ట్ సైంటిస్ట్ అనురాధ టీ.కే గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఇస్రో లో స్పెషలైజ్‌డ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ శాఖకు ఆమె ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు. 1961లో జన్మించిన అనురాధ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచిలర్స్ పట్టా ను బెంగళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ లో సాధించారు.

ఇస్రో లో తొలి మహిళా శాటిలైట్ ప్రాజెక్టు డైరెక్టర్ 

జీశాట్12, జీశాట్ 10 ఉపగ్రహ ప్రయోగాల్లో అనురాధ టీ.కే కీలకమైన పాత్రను పోషించారు.   జియో సింక్రనస్ శాటిలైట్స్ విభాగంలో టెలికం, డేటా లింక్స్‌ వంటి అత్యంత ముఖ్యమైన పనులకు సంబందించిన బాధ్యత సైతం అనురాధ తీసుకున్నారు. ఇక జీశాట్ 12 ఉపగ్రహ ప్రయోగం 2011లో జరగగా, అది సక్సెస్ అవ్వడంతో అనురాధ కృషి ఎనలేనిది. జీశాట్9, జీశాట్17, జీశాట్ 18 వంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ కి సైతం అనురాధ  పోజెక్టు డైరెక్టర్ గా అందించిన సేవలు నిజంగా అమోఘం. ఇక అనురాధ మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో భరత్ విత్తనం పడిందని, ఇంకా సైన్సును ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం మన బావి తారలపై ఉందంటూ తెలిపారు.

ఒక్క అనురాధ మాత్రమే కాదు ఇస్రో లో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది ముఖ్యంగా మహిళలే. మున్ముందు సైతం ఎంతో మంది మహిళలకు ఇస్రో ఎర్ర తీవాచీ పరుస్తుంది అనడం లో  ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: