ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా జుట్టు పెరగటం లేదని ఇంకా అలాగే ఉన్న జుట్టు కూడా చాలా త్వరగా తెల్లబడుతుందని, అందంగా లేదని బాధపడుతూ ఉంటారు. అయితే, మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చివర్ల చీలికలను వదిలించుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. వాటితో మీ జుట్టు ఆరోగ్యం ఇంకా జుట్టు సౌందర్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మీ జుట్టును క్రమం తప్పకుండా దువ్వటం తప్పనిసరిగా చెయ్యాలి. మీరు మీ జుట్టును అల్లడం లేదా వదులుగా వేసుకుంటే, మీ జుట్టును సరిగ్గా విడదీయండి. జుట్టు విడదీయకపోతే, జుట్టు ఎక్కువగా దువ్వెనలో ఇరుక్కుపోతుంది. ఇంకా అలాగే చివర్లు చీలిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన జట్టు కోసం ప్రతి రోజు కూడా మీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ సి, ఐరన్ లు ఎక్కవ ఉంటాయి. ఇవి జట్టు కుదుళ్లను బాగా బలంగా చేసి ఇంకా మీ జుట్టు రాలకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.


మీ జుట్టు చివర్లు చీలకుండా ఉండాలంటే.. తలకు బాదం, కొబ్బరి నూనెను కలిపి రాయండి. ఈ నూనెలు మీ జుట్టును హైడ్రేట్ చేస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. అలాగే, హెయిర్‌ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం మానుకోండి.. స్ట్రెయిట్‌నర్‌లు, బ్లో డ్రైయర్‌ల వంటి స్టైలింగ్ సాధనాల వేడికి గురికావడం వల్ల జుట్టు పెళుసుగా మారతుఉంది. చివర్లు చీలిపోతుంది.జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చిట్లడం వంటి అనేక సమస్యలను వదిలించుకోవడానికి.. జుట్టు స్ప్లిట్స్‌ కారణంగా వెంట్రుకలు చివర్లు జుట్టుగా చీలిపోతాయి. జుట్టు చిట్లడం, పొడిబారడం మరియు చివర్లు చిట్లకుండా ఉండేందుకు మీ జుట్టును సున్నితంగా కడగడం చాలా ముఖ్యం. అందుకోసం ముఖ్యంగా మీ జుట్టును వేడి నీటితో కడగడం మానుకోండి.. మీ జుట్టును వేడి నీటితో కడగడం వల్ల అది బలహీనంగా, పొడిగా మారుతుంది. జుట్టు చివర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో వెంట్రుకలు చివర్లు చీలిపోయే అవకాశం ఉంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: