శంషాబాద్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లహరి ముందే వెంకటేష్ అమ్మాయిలతో వీడియో కాల్స్ మాట్లాడటమే కాకుండా సరసాలు కూడా చేసే వాడు అని లహరి ఆత్మహత్య వీడియో లో పేర్కొంది. ఆమెకు పిల్లలు పుట్టడం లేదు అని తరుచుగా వేధించే వాడు అని వాపోయింది.
అతను అంటే తనకు చాలా ప్రేమ ఉందని కాని ఎక్కువ కాలం భరించలేకపోయా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. లహరి ముందే కొందరు అమ్మాయిలతో అతను సరసాలు కూడా చేసాడు. వీడియో కాల్ లో అమ్మాయిలతో అతను న్యూడ్ గా మాట్లాడాడు. తాను ఎక్కువ కాలం భరించలేకపోయా అంటూ ఆమె ఆవేదనగా మాట్లాడటం అందరిని కలచి వేసింది. అతనిని కఠినంగా శిక్షించాలి అని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.