అమెరికాలో తెల్లజాతి పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు మరణించిన తర్వాత తీవ్ర్ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ మరణం  తర్వాత బ్లాక్ లీవ్స్  మేటర్ అనే ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇది క్రికెట్ కి కూడా పాకింది. క్రికెట్ లో నల్ల జాతి క్రికెటర్లకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ముంబై జట్టు ఆటగాడు హార్దిక్ పాండ్యా బ్లాక్ లీవ్స్ మేటర్ సింబల్ చూపించాడు మైదానంలో.

బ్యాటింగ్ లో అదరగొట్టిన పాండ్యా అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మోకాళ్ళపై కూర్చుని చేయి పైకి లేపి ముంబై జట్టు కెప్టెన్  పోలార్డ్ కి చూపించాడు. ఈ ఫోటో సోషల్  మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేసాడు. కాగా నిన్న ముంబై ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: