తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాత పిఆర్ఓ బిఏ రాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది.. ఆయన మరణానికి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు..

 టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో అనుబంధం కలిగి ఉన్న బి.ఏ.రాజు మరణంతో దాదాపు టాలీవుడ్ అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం మీద ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.. ఈ వార్త తాను విని విషాదంలో కూరుకుపోయానని ఆయన చెప్పుకొచ్చారు.. ఇక ఈ సమయంలో ఆ కుటుంబానికి ధైర్యం కలిగించాలని దేవుని కోరుతున్నాను అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: