చినజీయర్ స్వామి మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా సమతా కుంభ్ పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు 135 కోట్ల మంది ప్రజలు ఆహ్వానితులేనంటున్నారు చిన్నజీయర్ స్వామి. 108 దివ్యదేశాల్లోని దేవతామూర్తులకు సామాన్యుల సమక్షంలో కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుందని చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఎంతో మంది ప్రజల సమతామూర్తి కేంద్రాన్ని దర్శించి రామానుజాచార్యులు సిద్ధాంతాలు తెలుసుకొని స్ఫూర్తి పొందారని చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు.


ఫిబ్రవరి 11న లక్ష మందితో భవద్గీత పారాయణం జరుగుతుందని చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు. ఆధ్యాత్మిక మార్గానే కాకుండా సామాజిక కోణంలోనూ రామానుజాచార్యులు ఎంతో సేవ చేశారని, అందులో భాగంగా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా 200 మంది వైద్యులతో వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు. ఇటీవలే స్వామికి పద్మ భూషణ్‌ పురస్కారం కూడా దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: