క్షణికావేశం.. ఇదే ప్రస్తుతం ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. కాదు కాదు ఏకంగా జీవితాలనే ముగిసి పోయేలా చేస్తుంది. ఎందుకంటే నేటి రోజుల్లో క్షణికావేశంలో ఎంతోమంది తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో దారుణాలకు ఎన్నో విషాదకర ఘటన లకు కారణం అవుతున్నాయి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో వెనకా ముందు ఆలోచించకుండా క్షణికావేశంలో కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి వారి ప్రాణాలను గాల్లో కల్పిస్తున్నాయ్. ఎందుకంటే ఇలా క్షణికావేశంలో నిర్ణయాల కారణంగానే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.



 ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఏకంగా బలవంతంగా ప్రాణాలు తీసుకునెంతవరకు వెళుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్ళింది  అయితే ఎంతకీ భార్య తిరిగి రాకపోవడంతో మద్యానికి బానిసగా మారిపోయాడు భర్త.. చివరికి ఒంటరి జీవితాన్ని భరించలేక ఎంతగానో కుంగిపోయాడు. ఇక ఈ జీవితం వృధా అని భావించి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బిక్కనూరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.


 మండల కేంద్రానికి చెందిన తునికి రాజు అనే వ్యక్తి ప్లంబర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి సరిత తో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లపాటు సాఫీగా సాగింది సంసారం లో గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో భర్తతో గొడవ పడినా సరిత తన ఇద్దరు పిల్లలు రోహన్ ఋషితలను తీసుకొని కామారెడ్డి లోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త ఎంత బతిమిలాడినా ఇంటికి రాలేదు. దీంతో బాధలో తాగుడికి బానిస గా మారి పోయాడు రాజు. ఒంటరి జీవితం గడపలేకా తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: