పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా ఇప్పటివరకు ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఎనిమిదవ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ సినిమా ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో అద్భుతమైన స్థానంలో నిలిచింది. కానీ ఈ మూవీ కొన్ని సినిమాలను మాత్రం దాటలేకపోయింది. ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో ఓజి సినిమా కంటే ముందు ఉన్న మూవీలు ఏవో తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.33 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలా వైకుంటపురంలో సినిమా ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదవ రోజు 7.52 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నిక్కెవారు సినిమా ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.60 కలెక్షన్లను వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.58 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదల ఆయన ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 5.91 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. పవన్ హీరోగా రూపొందిన ఓజి సినిమా విడుదల అయిన ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.56 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన ఎనిమిదవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఏడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Og