బాబు, పవన్ జోడి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? తెలుగు దేశం, జనసేన, బీజేపీ కలిసి ఏం చేయనున్నాయి. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ, జనసేన ఎలాంటి ప్లాన్ లు వేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని కుదిరే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.


జనసేన, టీడీపీ మాత్రం కచ్చితంగా కలిసి పోటీ చేసేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు కట్టబెడుతుందనేది అసలు ప్రశ్న. జనసేన మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవి చూసింది. ఇలాంటి సమయంలో ఆంధ్రలో జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది. దీన్ని సమర్థంగా తట్టుకుని పవన్ ముందుకు ఎలా వెళ్లనున్నాడు తదితర అంశాలను ఎలా బేరీజు వేసుకుంటున్నారు.


ప్రజలు కూడా మార్పు కావాలని కోరుకుంటే ఆంధ్రలో చంద్రబాబు రావడం గ్యారెంటీ. కానీ ఎలా సాధించాలి. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే స్థానాల్లో పవన్ తో పాటు ఆ పార్టీ అభ్యర్థుల ను గెలిపించుకోవాలి.  గతంలో రెండు చోట్ల పవన్ ఓడినా ఈ సారి మాత్రం తప్పకుండా గెలిచే స్థానాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భీమవరంలో టీడీపీ మద్దతు ఉంటుంది. తద్వారా ఈసారి అసెంబ్లీలో పవన్ కనిపించే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు.


ఇదే సమయంలో పవన్ కల్యాణ్ చరిష్మా కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. చాలా వరకు చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తూనే పవన్ ను కూడా కలుపుకుపోవాలని అనకుంటున్నట్లు సమాాచారం. ఎందుకుంటే ఓట్లు చీలిపోకుండా ఉండటం వల్ల భవిష్యత్తులో మళ్లీ వైసీపీ సర్కారు రాకుండా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రా రాజకీయాల్లో పెను మార్పులు మాత్రం ఖాయం. ఎందుకంటే ఎన్నికల రణరంగాన ఏ పార్టీ పొత్తు కుదురుతుందో ఎక్కడా ఓడతారో, గెలుస్తారో మరి కొన్ని నెలల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: