
కానీ జనసేనలోని కొంతమంది నాయకుల వల్ల, ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు కలపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తమకు గౌరవనీయమైన సీట్లు ఇస్తేనే తెలుగుదేశంతో పొత్తు కలుపుకుంటామని, లేదంటే లేదని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరోపక్క బీజేపీకి సంబంధించిన తరుణ్ చుగ్ "అన్నిటినీ పరిశీలిస్తాం"అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని మీడియా వర్గాలు తెలంగాణలో టిడిపి తో బిజెపి పొత్తు కలపబోతుందని, ఆ తర్వాత ఆంధ్రాలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం ఇంకా బీజేపీ కలిసి పోటీ చేస్తారని వార్తలు మొదలవడంతో.. అదే రోజు సాయంత్రం 8గంటల్లోగా వాటికి ఆయన స్పందించి ఈ వార్తల్లో నిజం లేదని, తాము తెలుగుదేశంతో ముందుకు వెళ్ళేది లేదని, పవన్ కళ్యాణ్ తమతో కలిసి వస్తే ఆయనకు ముఖ్యస్థానం ఇస్తామని, అలా కాదని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్లాలని అనుకుంటే మాత్రం ఆయనతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధాలు ఉండబోవు అని చెప్పినట్టు తెలుస్తుంది.
అయితే రాజమండ్రిలో బీజేపీ కార్యవర్గ సమావేశంలో.. అసలు బిజెపి ఎవరితో ముందుకు వెళ్లబోతుందనే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యతిరేక శక్తులుగా ఉండి పోరాడడానికి జనసేన ఇంకా టిడిపి ఎలాగూ ముందుంటాయి. వాటితో పాటు బిజెపి కూడా కలిస్తే రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి.