అంతర్జాతీయ సంబంధాలు ఇప్పుడు అనేక దేశాల భవిష్యత్తులను మార్చబోతున్నాయి. ఇటీవలి కాలంలో ఇండియా తన అంతర్జాతీయ సంబంధాల విషయంలో అనేక కొత్త పోకడలు పోతోంది. విషయం ఏదైనా సరే.. సమస్య ఏదైనా సరే.. ఇండియా ఫస్ట్ అనే కోణంలోనే భారత్ ఆలోచిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది.


రష్యా దగ్గర్నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. రష్యా ఏముంటుంది అంటే డాలర్ కాకుండా వేరే కరెన్సీలో మనం ట్రాన్సాక్షన్ చేసుకుందాం, మీరు మా డబ్బుల్లో ఇవ్వండి అని అంటుంది. అంతా అలా ఇవ్వలేకపోయిన సందర్భంలో యువాన్లు లేదా రూబుల్స్ లో ట్రాన్సాక్షన్లు జరుపుకుందాం అని అంటుంది. అంటే చైనా కరెన్సీ లో లేదా  రష్యా కరెన్సీలో ట్రాన్సాక్షన్లు వాణిజ్య ట్రాన్సాక్షన్లు జరుపు కుందామని అడుగుతుంది.


అయితే భారతదేశం మాత్రం నేను ట్రాన్సాక్షన్స్ కనుక జరిపితే ఒకటి భారత రూపాయిలో ఇస్తాము, రెండవది రష్యాకి సంబంధించి రూబుల్లో ఇస్తాము, మూడోది అరబ్ కు సంబంధించిన  దిర్హాం కరెన్సీలో ఇస్తాము, అంతేగాని చైనాకు సంబంధించిన కరెన్సీ యువాన్ల మేము ఇవ్వము అని తేల్చి చెప్పేసింది మరొకసారి.


భారత ప్రభుత్వం రష్యా దిగుమతులకు చెల్లించాల్సిన చైనీస్ యువన్స్‌ను నివారించాలని బ్యాంకర్లు మరియు వ్యాపారులను కోరింది, ఎందుకంటే పొరుగు దేశమైన చైనా తో దీర్ఘ కాల రాజకీయ విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు   తెలుస్తోంది.


రష్యన్ చమురు మరియు రాయితీలో బొగ్గులకు ప్రధమ శ్రేణి కొనుగోలు దారుగా ఆవిర్భవించిన భారత దేశం వాణిజ్య ట్రాన్సాక్షన్ లు జరుపుకునే విషయంలో, చైనాతో తమ దేశానికి ఉన్న విభేదాల వల్ల చైనా కరెన్సీ అయినా యువాన్ వాడకాన్ని మానేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారి దిర్హాం ను ఉపయోగించడం ద్వారా  చైనీస్ యువాన్ తో జరిగే వాణిజ్య వ్యవస్థను అస్థిరపరచడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఇది జరుగుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: