
జనసేనకు 32% ఓట్లు షేరింగ్ మచిలీపట్నం, ఏలూరు, నరసాపురం, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఎలైన్స్లోకి ప్రవేశిస్తే రాష్ట్రవ్యాప్తంగా 40%ఓట్లు వస్తాయి. వైఎస్ఆర్సీపీ ఒక్కదానికే 46% ఓట్లు వస్తాయి. ఇవి వీళ్ళ అంచనాలకు సంబంధించినంత వరకు. పోల్స్ క్యాన్ ప్రీ పోల్ సర్వే డీటెయిల్స్ ఏంటయ్యా అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సిపికి 118-130సీట్లు వస్తాయట.
తెలుగుదేశం పార్టీకి 39-46సీట్లు వస్తాయని, జనసేన ఇంకా బిజెపి కూటమికి 3-5 స్థానాలు వస్తాయని తెలుస్తుంది. కాగా 15 సీట్లలో టైట్ ఉంటుందంట. టిడిపి, జనసేన కలిస్తే వైఎస్ఆర్సిపికి 100-110స్థానాలు వస్తాయని, టిడిపికి 45-55స్థానాలు వస్తాయని, జనసేన బిజెపికి 6-12సీట్లు వస్తాయని, అదే సందర్భంలో టిడిపి తో జనసేన పార్టీకి ఐదు వస్తాయని, టైట్ 19 ఉంటాయని వీళ్ళ లెక్క.
పార్లమెంటరీ చూస్తే వైఎస్సార్సీపీకి 19-21, తెలుగుదేశం పార్టీకి 2-4, జనసేన ఇంకా బిజెపికి 4ఉంటాయని తెలుస్తుంది. కనుక 15-17 వైఎస్ఆర్సిపికి తగ్గుతాయని, తెలుగు దేశం పార్టీకి 5-7 తగ్గుతాయని, జనసేన బిజెపికి 2-3 వస్తాయని, టైట్ 3 ఉంటాయన్నటువంటి లెక్కలు వేసుకొస్తున్నారు. నియోజక వర్గాల్లో తాడికొండ, అమలాపురం, సంతనూతలపాడు, కదిరి, ఉదయ గిరి, పొన్నూరు, పెనుగొండ, మచిలీ పట్నం, అనకాపల్లి, సత్తెనపల్లి మీద వ్యతిరేకత ఉందని లెక్క తేల్చారు.