తెలుగు దేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు  రామానాయుడు స్టూడియో గురించి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. దీన్ని సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. అయితే దీనిపై సాక్షి పత్రికలో టీడీపీ ఎమ్మెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిందని పతాక శీర్షికల్లో ప్రచురించింది. సినిమా రంగంలో జగన్ ను ఎక్కువ ద్వేషించే వారిలో సురేశ్ బాబు అని ఎక్కువగా వినిపిస్తుంది. సురేశ్ బాబు రామానాయుడు స్టూడియో గురించి ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేస్తే దాన్ని కొట్టి వేస్తే సాక్షి హైలైట్ చేయడం ఇక్కడ కొసమెరుపు.


గతంలో నిర్మాతలు, డైరెక్టర్లు, సినిమా రంగానికి చెందిన వారు చాలా మంది సినిమా టికెట్ల పెంపు విషయంలో జగన్ తో చర్చలు జరిపారు. రూ. 100 కే టికెట్ అమ్మాలని నిర్ణయించిన సమయంలో చిరంజీవి, నాగార్జున, ప్రభాస్ తదితర నటులు, డైరెక్టర్లు వచ్చి జగన్ ను కలిశారు. సినిమా రంగాన్ని కాపాడమని ప్రాధేయపడ్డారు. సురేశ్ బాబు మాత్రం సీఎం జగన్ ఆఫీసు వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. అవసరమైతే ఓటీటీ లో రిలీజ్ చేసుకుంటాం. కానీ జగన్ వద్దకు వెళ్లనని భీష్మీంచుకుర్చున్నారు.


రామానాయుడు స్టూడియో కోసం ప్రభుత్వం భూమి ఇచ్చింది. సినిమా రంగంలో అభివృద్ధి చెందడానికి, అక్కడ సినిమా షూటింగ్ లు తీసుకోవడానికని ఇచ్చారు. కానీ ఆ స్థలంలో ఇప్పుడు విల్లాలు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాటిని అమ్మేస్తున్నారు. అయితే ప్రభుత్వం చాలా తక్కువ ధరలో ఆ భూములను స్టూడియోకు ఇచ్చింది. ఇప్పుడు ఒక్కో విల్లా అమ్మితేనే దాదాపు రూ. కోటి లాభం వచ్చేలా ఉంది. స్టూడియో కోసం తీసుకున్న భూముల్లో విల్లాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు. ఎందుకిచ్చారు. దాని వెనక ఉన్న రహస్యం ఏమిటనే వివరాలు చెప్పకుండా టీడీపీ ఎమ్మెల్యే వేసిన కేసు కొట్టేశారని రాయడం ఆ పత్రికకే చెల్లింది.


మరింత సమాచారం తెలుసుకోండి: