
అక్కడ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పోటీ చేయరా అంటే, వాళ్లకి ఎన్నిసార్లు అలా పోటీ చేసినా ఏమి ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు ఇప్పుడు పోటీ చేయకుండా దేశవ్యాప్తంగా ఒక్కరినే పెడతాం అంటే దేశవ్యాప్తంగా ఓవరాల్ గా యూపీఏ లేదా ఎన్డీఏ మాత్రమే ఉండాలి. మిగిలిన థర్డ్ ఫ్రంట్ అనే వాళ్ళని తొక్కి పడేయాలి అని వాళ్ళ లెక్క.
ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ నుంచి పైకి వచ్చిన నితీష్ కుమార్ ఇప్పుడు తృతీయ ప్రత్యామ్నయం లేకుండా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. పైగా తృతీయ ప్రత్యామ్నాయ పక్షాలను కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ లో భాగస్వామ్యం చేసేందుకు, కలిపేసేందుకు చేసేటువంటి ప్రయత్నం లో ఆడుతున్నటువంటి నాటకం ఇదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కానీ వీళ్ళ సందేహం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసి పోతుందా? మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసి పోతుందా? అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ లో కలిసిపోతారా, అక్కడ వేరే వాళ్ళని పెట్టకుండా ఉంటారా అనేది వాళ్ళ ప్రశ్న. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓకేనా, నవీన్ పట్నాయక్ ఓకేనా, తెలంగాణలో కేసీఆర్ ఓకేనా అని ఆలోచిస్తే కేసీఆర్ అయితే వాళ్లకు సరిపోతారని వాళ్ళ భావన. ఎందుకంటే ఆయన నితీష్ కుమార్ తో కాకుండా డైరెక్ట్ గా పార్టీతోనే పొత్తు పెట్టుకుంటారని, కాబట్టి చివరికి ఏం జరుగుతుందో చూడాలని వాళ్లు అంటున్నారు.