రాజకీయాలు ఎలాంటి నీచమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి కుటుంబాల్లో చిచ్చు పెడతాయి .. రక్తసంబంధీకుల మధ్య గొడవలు సృష్టిస్తాయి .. రాజకీయ కుటుంబం పెద్ద ఫెయిల్ అయితే కుటుంబాలు నిట్టనిలువునా చీలిపోతాయి. దీంతో పార్టీలు కూడా చేరిపోతాయి. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు చూశాం .. ఇప్పుడు ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల అధికారం కోల్పోయిన రెండు ప్రాంతీయ పార్టీలకు వచ్చింది. పార్టీ ని ఏకతాటిపై నిలపాల్సిన పెద్దలు వివక్ష చూపి కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటున్నారు. మళ్లీ కలప లేనంతగా వీరి మధ్య బంధాల పగుళ్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలను దాదాపు 10 ఏళ్లపాటు ఏక చక్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె ఇప్పుడు బిఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేపుతున్నారు. ఆ పార్టీ ఇప్పుడు చీలిక అంచున ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆమె తన తండ్రికి రాసిన లేఖలో బీఆర్ఎస్ పార్టీ విధానాలను సూటిగా ప్రశ్నించే లాగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని కేసీఆర్ కేటీఆర్ ఒక్క మాట కూడా అనటం లేదని బిజెపి పట్ల ఎందుకు అంత భయభక్తులు ? చూపిస్తున్నారని ఆమె నేరుగానే ప్రశ్నించినట్లయింది.
ఎందుకు బిజెపిపై పోరాటం లేదని కవిత తన తండ్రిని ప్రశ్నించారు. పైగా తన తండ్రి దగ్గరే తనకు యాక్సిస్ తెలియదన్నట్టుగా కవిత లేక రాయటం చిన్న విషయం కాదు. ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వలేదని సీనియర్ నేతలకు చాన్స్ ఇవ్వలేదని ఆమె మాట్లాడారు. ఇక కవిత తన దారి తను చూసుకోవాలన్న ఆలోచనకు వచ్చేసారా ? అన్న సందేహాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారంలోకి ఉన్నా వైసీపీ అధినేత జగన్‌కు కూడా ఎన్నికలకు ముందు ఇదే పరిస్థితి ఎదురయింది. జగన్ ఏకంగా చెల్లి, తల్లిపై కోర్టులో కేసు వేశారు. అటు షర్మిల కూడా ఎన్నికలకు మూడేళ్ల ముందే తన అన్నకు దూరమై తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. చివరకు ఎన్నికలకు ముందు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నారు. చివరికి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి తమ అడ్డా అయినా కడపలోనే కాంగ్రెస్ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు వైఎస్సార్ ఫ్యామిలీ కూడా నిట్ట నిలువునా చీలిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు