ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్) వారు భావి భారత సైంటిస్టులకి ఇస్రో లో పనిచేసే గొప్ప అవకాసం కలిపించనున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో ఉండే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పిఎస్సి) - సైంటిస్ట్ / ఇంజనీర్ (లెవల్ 10, 11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇచ్చిన నోటిఫికేషన్ యువ శాస్త్రవేత్తలకి ఎంతో మంచి అవకాశమే అని చెప్పాలి..
ఇస్రో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం
మొత్తం ఖాళీలు: 17
ఉద్యోగ విభాగాలు : మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, వెల్డింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్, మెషిన్ డిజైనింగ్, టర్బో మెషినరీ, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్
ఉద్యోగ అర్హత - సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో పీజీ/ పిహెచ్డి/ తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 14
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27
మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింకు ని ఓపెన్ చేసి చూడవచ్చు
వెబ్సైట్: www.lpsc.gov.in