
మరీ ముఖ్యంగా ఉదయం లేచి లేవగానే టీ తాగుతూ ఉండడం.. ఆ తర్వాత వ్యాయామలు లాంటివి చేయకుండా టీవీ ముందు కూర్చుని అలాగే టైం పాస్ చేస్తూ ఉండడం ..బాడీకి ఫిజికల్ ఆక్టివిటీ లేకుండా గంటలు గంటలు సోఫాలలో కుర్చీలలో కూర్చొని పనులు చేసుకుంటూ ఉండడమే ప్రధాన కారణం అంటున్నారు డాక్టర్లు . మరీ ముఖ్యంగా అబ్బాయిలలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా పడిపోతూ వస్తుంది అని చెప్తున్నారు . ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ చుట్టూరు అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువగా తిరుగుతున్నారు అని .. ఒక భార్యాభర్తలు పిల్లలు కడగడం లేదు అంటూ తమ వద్దకు వస్తే అమ్మాయి కన్నా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అబ్బాయి ల్లలోనే ఉంటుంది అని.. అమ్మాయికి నెలసరి సరిగ్గా వస్తు ఎగ్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవుతుంది అని .. కానీ అబ్బాయిలలో మాత్రం స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేకపోతే .. పిల్లలు కలగనే కలగరు అని చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ భార్యాభర్తలు ఎలా తిరుగుతున్నారో అందరికీ తెలిసిందే .
మన చుట్టుపక్కల ఇళ్లల్లో మనకు తెలిసిన వాళ్ళలో అంతెందుకు మన ఇళ్లల్లో కూడా ఈ సమస్యతో బాధపడే అబ్బాయిలు చాలామంది ఉంటారు . అయితే స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి డాక్టర్లు రకరకాల డైట్ లు చెపుతున్నారు. మరి ముఖ్యంగా గుమ్మడి గింజలు ..దోస గింజలు ..చియా సీడ్స్ ..దానిమ్మ గింజలు ..మటన్ సూప్.. ఇలాంటివి తీసుకోవడం ద్వారా అబ్బాయిలలో స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరిగిపోతుందట. అంతేకాదు దానికి తగ్గట్టే హెల్తీ డైట్ కూడా ఫాలో అవ్వాలి. ఆయిల్ ఫుడ్స్ పూర్తిగా దూరం పెట్టేయాలి . బేకరీ ఫుడ్స్ అస్సలు తినకూడదు అంటున్నారు డాక్టర్లు . కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చొని వర్క్ చేయడం ద్వారా కూడా ఆ రేడియేషన్ కి బాడీలో కలిగే మార్పుల వల్ల స్పర్మ్ కౌంట్ విపరీతంగా తగ్గిపోతుందట . దానికి తగ్గట్టే వర్క్ టెన్షన్స్ ప్రతి ఒక్కరికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. అవి ఫినిష్ చేయాలి అన్న ఆలోచనలో ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు . తద్వారా బీపీ - షుగర్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో 32 దాటగానే అబ్బాయిలకి షుగర్ బీపీ వచ్చేస్తున్నాయి .ఇది అబ్బాయిలకు హెచ్ఐవి కన్నా మోర్ డేంజరస్ గా మారిపోతుంది అంటూ కొంతమంది కామన్ పీపుల్స్ కూడా మాట్లాడుతున్నారు. అబ్బాయిలకి స్పెర్మ్ కౌంట్ పడిపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరి మరి ఇంపార్టెంట్ అంటూ స్వయానా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు..!!