మీ పిల్లలకు జుట్టు పెరుగుదల తక్కువగా ఉందా. అయితే ఈ వార్త మీకోసమే. పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు జుట్టు పలుచగా ఉండి తల కనిపిస్తుంది. నెలలు గడిచే కొద్దీ జుట్టు  పెరుగుతున్నప్పటికీ, మీ శిశువు జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండటానికి మీరు కొన్ని చిట్కాలను పాటించండి. ఇక విటమిన్ ఇ నూనెను కూడా మీ పిల్లల తల, జుట్టుకు చాలా అవసరమైన పోషకాలను అందించడానికి ఉపయోగించొచ్చు. కొన్ని చుక్కల విటమిన్ ఇ నూనెను కొబ్బరి నూనెలో కలిపి పిల్లల జుట్టుకు రాయండి. విటమిన్నూనె తలలో కావాల్సినంత తేమను ఉంచుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది..

ఇక కొబ్బరి నూనె జుట్టుకు ఎక్కువ పోషణను ఇచ్చే తేలికపాటి నూనెలలో ఒకటి. ఇది తల మీద చర్మంను ఆరోగ్యంగా ఉండేటట్లు చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెతో పిల్లల తలను క్రమం తప్పకుండా మసాజ్ చేయండి. దీనివల్ల వారి జుట్టు ఒత్తుగా, సిల్కీగా చేస్తుంది. మసాజ్ కోసం మీరు కొబ్బరి నూనెకి బదులు ఆముదంను కూడా వాడవచ్చు. పిల్లలు అందంగా కనిపించాలని రెడీ చేస్తారు కానీ ఇలా వారికి జడ వేయడం వలన పిల్లల జుట్టు డామేజ్ అవుతుంది. పిల్లల జుట్టు యొక్క మూలాలు బలహీనంగా ఉంటాయి. మీరు జడ వేయడం వల్ల జుట్టు పాడవుతుంది. అంతేకాక జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఉంది.

అయితే జుట్టు బాగా పెరగడానికి సులభమైన మరియు సహజమైన మార్గం కలబందను ఉపయోగించడం. మీరు మొక్క నుండి తీసిన తాజా కలబందను అయినా లేదా షాపుల్లో కొన్న కలబందను అయినా ఉపయోగించవచ్చు. శిశువు యొక్క తలపై కలబంద జెల్ ను అప్లయ్ చేసి బాగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత బాగా కడగండి. జెలటిన్ ప్రోలిన్ వంటి అమినో యాసిడ్స్ లతో నిండి ఉంది. ఇది మీ శిశువు యొక్క చర్మం పొడిబారకుండా చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీరు దీనిని ఉపయోగించే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: