మలబద్దకం సమస్యని దూరం చేసే ఆహారాలు?

ఇక మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా మన ఇంట్లోనే మన వంటగదిలోనే ఉంటుంది. వంటింట్లో లభ్యమయ్యే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలతో చాలా ఈజీగా మలబద్దకానికి చెక్ పెట్టవచ్చు.ఇక పెరుగులో బిఫిడోబాక్టీరియం లాక్టిస్ అనే బ్యాక్టీరియాతోపాటు ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి.అందువల్ల ఇది జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతాయి.ఇంకా అలాగే అవిసె గింజల్లో కూడా కరిగే ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది.ఫైబర్ నీటిలో కరిగిపోతుంది.ఇక పెరుగు, అవిగిసె గింజల పొడిని క్రమం తప్పుకుండా మీ ఆహారంలో మీరు చేర్చుకున్నట్లయితే.. మలం మృదువుగా ఇంకా సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది.ఇంకా అలాగే ఉదయం పూట ఒక గ్లాసు నీటిలో సుమారు 30 మిల్లీలీటర్ల ఉసిరి రసాన్ని కలిపి తాగితే కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది.ఎందుకంటే ఇది జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.


ఇక ఇలా ప్రతిరోజూ చేసినట్లయితే మలబద్ధకం సమస్య చాలా ఈజీగా తగ్గిపోతుంది.ఇంకా అలాగే నెయ్యి అనేది బ్యూట్రిక్ యాసిడ్  గొప్ప మూలం. ఇది పేగు జీవక్రియను బాగా మెరుగుపరుస్తుంది.అంతేకాదు మలం  కదలికలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. మీరు నిద్రపోయే ముందు ఒక కప్పు వేడి పాలలో ఖచ్చితంగా 1 టీస్పూన్ నెయ్యి తీసుకోండి.ఎందుకంటే దీన్ని తీసుకుంటే ఆ మరుసటి రోజు ఉదయం మలబద్ధకాన్ని తగ్గించడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.ఇక ఆకుకూరల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఈ ఆకుకూరలు జీర్ణక్రియను బాగా పెంచుతాయి. బచ్చలికూర, బ్రస్సెల్స్ మొలకలు ఇంకా అలాగే బ్రోకలీ వంటి ఆకుకూరలు పీచుతో చాలా సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫోలేట్, విటమిన్లు C, K  గొప్ప మూలాధారాలుగా పనిచేస్తాయి. ఈ ఆకుకూరలు మలబద్దకం సమస్యను తీర్చడంతోపాటు బరువును కూడా తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి.అలాగే రోజుకి వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: