వేసవిలో అధిక ఎండ,వేడి,చమట కారణంగా జుట్టు రాలడం,చుండ్రు,జుట్టు చిట్లడం,చికాకు,దురద వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.మరీ ముఖ్యంగా స్త్రీలు.వారికున్న పొడవాటి జుట్టుతో రోజు తల స్నానం చేయలేరు.కాబట్టి వారికి ఇంకా ఎక్కువగా సమస్యలు ఉంటాయి. ఇలా జుట్టు సమస్యలతో బాధపడేవారు షాంపూలు కొన్ని రకాల పదార్థాలు కలిపి వాడటం వల్ల, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చని బ్యూటిషన్స్ సజెషన్స్ చేస్తూ ఉంటారు.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

స్త్రీలు షాంపు చేసుకునేటప్పుడు,అందులో కాఫీ డికాషన్ కలుపుకొని స్నానం చేయడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలను దరిచేరకుండా కాపాడుకోవచ్చు.జుట్టు సమస్యలు ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి.ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కాఫీ డికాషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.అంతే కాక కాఫీ పౌడర్ జుట్టుకు ఒక టోనర్ లాగా కూడా సహాయపడుతుంది.దీనికోసం ఒక గిన్నెలో 2 గ్లాసుల నీరు పోసి,ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి రంగు మారే వరకు బాగా మరిగించాలి.అ తర్వాత వడకట్టి చల్లార్చుకొని,ఇందులోఒక స్ఫూన్ నిమ్మరసం కలిపాలి.

పైన చెప్పిన మిశ్రమాన్ని మనం తల స్నానం చేసుకునే సమయంలో,షాంపూతో పాటు,ఈ మిశ్రమాన్ని కలిపి,జుట్టు మొదలు నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి.ఇది బాగా ఆరిన తర్వాత,మర్దన చేస్తూ తలస్నానం చేయాలి.ఆ తర్వాత జుట్టు పొడిబారకుండా, సీరం అప్లై చేయడం వల్ల,జుట్టు మృదువుగా పెరగడానికి సహాయపడుతుంది.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల,తలలో చెమట వల్ల కలిగే జిడ్డు,మురికిని పోగొట్టడానికి ఇందులో వాడే నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది.మరియు కాఫీ పౌడర్ లోని కెఫెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని రాకుండా సహాయపడి,జుట్టు రాలే సమస్యలను  తొలగిస్తుంది. అంతేకాక జుట్టు సమస్యలకు పోషకాహార లోపం కూడా ఒక కారణం. ప్రతి ఒక్కరూ సరైన క్రమంలో,సరైన సమయంలో,ఆహారం తీసుకొని,తగిన నీటిని తాగడం వల్ల,శరీరం డిహైడేటెడ్ గా ఉండి,చుండ్రు,జుట్టు రాలడం,చివర్లు చిట్లడం, దురద, చికాకు వంటి సమస్యలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: