ప్రతి మనిషికీ ఆత్మాభిమానం ఉండాలి. వెన్నెముక లేని మనస్తత్వం.. వ్యక్తిత్వానికి శోభ ఇవ్వదు. మనపై మనకు నమ్మకం ఉండాలి. మనపై మనకు ప్రేమ ఉండాలి. అయితే చాలా మంది దీన్ని పట్టించుకోరు. మన పని జరగాలి.. అదే ముఖ్యం అనుకుంటారు.

 

 

తమ తమ పనుల కోసం వ్యక్తిత్వాలను సైతం పక్కకు పెట్టేస్తారు. కానీ.. అదే సమయంలో కొందరు విపరీతమైన ఆత్మ విశ్వాసం ప్రదర్శిస్తారు. తాము చెప్పిందే రైట్ అంటారు. తమకు తెలియనివి ఏవీ లేవనుకుంటారు. ఇది ఆత్మ విశ్వాసం కాదు.. అతి విశ్వాసం.. దీన్నే జనం పొగరు అని చెప్పుకుంటారు.

 

 

మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ పొగరు ఉండకూడదు. పొగరు మన కళ్లకు పొరగా మారుతుంది. వాస్తవాలను గుర్తించకుండా చేస్తుంది. ఆత్మ విశ్వాసం మనకు కొండంత బలం ఇస్తే.. అతి విశ్వాసం అపజయానికి బాటలు పరుస్తుంది. మరికొందరు ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తారు.. ఒకరికి మనం గుర్తు లేకపోవడం.. మన తప్పు కాదు కానీ.. మనల్ని మరచి పోయిన వారిని.. ఇంకా గుర్తు చేసు కోవడం మాత్రం మన తప్పే..

 

 

మనతో మాట్లాడటం తగ్గిస్తున్నారు అంటే.. మనల్ని వదిలేస్తున్నారని అర్థం చేసుకోవాలి.. రెస్పెక్ట్ ఇచ్చేవారి కన్నా, బిస్కెట్ వేసే వాళ్ళనే ఎక్కువ నమ్ముతారు.. విసిరి పారేసిన బొమ్మ విలువ.. దాన్ని వేరే పిల్లలు తీసుకుని ఆడుకుంటున్నప్పుడు తెలుస్తుంది. కొన్ని సమయాల్లో మనిషి మనస్తత్వం కూడా అంతే.. కాలం కొందరిని దగ్గర చేస్తుంది కొందరిని దూరం చేస్తుంది..కొందరి పరిచయాలను కూడా.. మరిచిపోయేలా చేస్తుంది. కాలం ఎలా గడిచినా ఎదురు దెబ్బలు ఎదురైనా ఆత్మవిశ్వాసం మాత్రం వీడకూడదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: