ఏర్పడిన ప్రణయ పట్టణం.. ప్రేమ సౌధం.. ఈ నగరంలో అలనాటి చరిత్రను ఈనాటి తరానికి అందించే చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ ఆనాటి విశేషాలను సందర్శకులకు కళ్లకు కడతాయి. అలాంటి కట్టడాల్లో మరో మహా కట్టడం ఇప్పుడు సందర్శకులకు అందుబాటులోకి రాబోతోంది. అదే నగరం నడిబొడ్డున కోఠీలో ఉన్న బ్రిటిష్‌ రెసిడెన్సీ భవనం.


ఈ బ్రిటిష్‌ రెసిడెన్సీ బ్రిటిష్‌ పాలకుల రాజసానికి ఓ ఉదాహరణ. మూసీ నదికి నగరం అభివృద్ధి చెందేందుకు కారణమైన భవనం. వేలాది మంది విద్యార్థినులకు విద్యాగంధం పూసిన మణిహారం. రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోఠిలోని ఈ బ్రిటీష్‌ రెసిడెన్సీ భవనం ఇప్పుడు సందర్శకుల కోసం అందుబాటులోకి వస్తోంది. వరల్డ్‌ మాన్యుమెంట్‌ ఫండ్‌ ఈ బ్రిటిష్‌ రెసిడెన్సీ సరికొత్త అందాలు సంతరించుకుని సరికొత్తగా ముస్తాబైంది. ఇప్పటి వరకూ ఈ బ్రిటిష్‌ రెసిడెన్సీ అందాలు చూసేందుకు కోఠి కళాశాల విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉండేది.


త్వరలో ఈబ్రిటిష్‌ రెసిడెన్సీని సాధారణ ప్రజలకూ అందుబాటులోకి తేనున్నారు. టికెట్‌ వ్యవస్థ పెట్టి ప్రజలు చూసేందుకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ బ్రిటిష్‌ రెసిడెన్సీ మొదటి అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో 1779-1947 మధ్య ఈ భవనంలో నివసించిన వారి ఫొటోలు, పేర్లు, ఈ బ్రిటిష్‌ రెసిడెన్సీ భవనం చరిత్ర, నిజాం నవాబుల చిత్రపటాలు, ఆనాటి వేడుకల ఫోటోలు, వివిధ సందర్భాల్లో తీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.


ఈ భవనానికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని చెన్నై ఇంజినీర్‌ శామ్యూల్‌ రసెల్స్‌ డిజైన్‌ చేశాడు. 1803లో దీని నిర్మాణం పూర్తయింది. 1797-1805 మధ్య దీనిలో జేఏ కిర్క్‌ప్యాట్రిక్స్‌ నివసిరంచారు. ఆయన ఖైరున్నీసా బేగం అనే పాతబస్తీ రాచవనితను ప్రేమించి పెళ్లాడారు. ఆమెతో ఇక్కడే నివసించారు. స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో విలీనం అయ్యాక ఈ భవనాన్ని ఉస్మానియా మహిళా కళాశాలగా మార్చి చదువుల నిలయంగా మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: