ఇటీవల కాలంలో చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటికే పరిమితం అయి తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇకపోతే ఒకేచోట కూర్చొని మెడ వంచి లాప్టాప్ ముందు పని చేయడం వల్ల  మెడను తిప్పడం ఎక్కువసేపు సిస్టం చూడడం తదితర కారణాల వల్ల మెడనొప్పి వచ్చే సమస్య ఎక్కువ అవుతుంది. ఇక ఈ సమస్యను తగ్గించుకోవాలి అంటే కొన్ని చిట్కాలను పాటించి తీరాల్సిందే. నిజానికి శారీరక శ్రమ అధికమవుతున్న నేపథ్యంలో రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక, ఒంటినొప్పులు మరో ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి. ఇక కనీసం హాయిగా నిద్ర పోదామన్నా సరే ఇంటి బాధ్యతలు కూర్చొనివ్వవు.. నిల్చొనివ్వవు.

 ఇక ఇలా పనిచేస్తున్న సమయంలో మెడ వెనుక భాగంలో భుజాల దగ్గర ఏదైనా నొప్పి లాంటిది ఉన్నట్లయితే దానిని నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేస్తే అంతకంతకు పెరుగుతుందే తప్ప వదలదు. ఇక ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఇలాంటి సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కానీ ఒకే చోట కూర్చుని సిస్టం, లాప్టాప్ వంటి వాటితో పని చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా ఈ నొప్పి మొదలవుతుంది. ఇక ఇలాంటి చిన్నచిన్న నొప్పులే భవిష్యత్తులో ఆర్థరైటిస్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీ కీబోర్డు.. మీ మోచేతుల కంటే కిందకు ఉండేలా చూసుకోవాలి. మీరు కూర్చునే విధానం లో కూడా మీ చేతుల కంటే కీబోర్డు కొంచెం ఎత్తుగా ఉంటే  మీరు కూర్చునే కుర్చీ హైట్ కూడా పెంచుకొని కూర్చోవాలి. ఏం చేసినా సరే మీ మోచేతులు ఎత్తుగా ఉండే లాగా చూసుకోవాలి. ఇక రెగ్యులర్ గా యోగా, ఎక్సర్సైజ్ వంటివి చేయడం వల్ల కండరాలలో కదలికలు  ఏర్పడి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే అడ్డమైన నొప్పుల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇక ఇంటిపని, వంటపని ఇలాంటివి చేయడం వల్ల కూడా కండరాలలో కదలికలు ఏర్పడి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: