మన బాడీలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మనం ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటాం. రోగ నిరోధక్తి తక్కువగా ఉండడం వల్ల ఇవే కాకుండా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతూ ఎంతగానో బాధ పడుతూ ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఖచ్చితంగా తగినంత రోగ నిరోధక శక్తి అనేది ఉండడం చాలా అవసరం.మన ఇంట్లో తయారు చేసుకున్న ఒక మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచుకోవచ్చు.ఇంకా అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి కూడా చాలా సులభంగా ఉపశమనాన్ని పొందవచ్చు. దగ్గు, జలుబులతో బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల చాలా చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జలుబులను తగ్గించే ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో  తెలుసుకుందాం.


ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి మనం బాదం పప్పును, రెండు ఎండు ఖర్జూరాలను, అల్లం రసాన్ని, బెల్లం తురుమును, బ్లాక్ సాల్ట్ ను, పసుపును తీసుకోవాల్సి ఉంటుంది.మీరు ముందుగా జార్ లో బాదం పప్పు, గింజలు తీసేసిన ఎండు ఖర్జూరాలను వేసి వాటిని పొడి చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అల్లం రసాన్ని కూడా వేసి వేడి చేయాలి. ఇక ఆ అల్లం రసం వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న బాదం, ఖర్జూరాల పొడిని వేసి కలపాలి. అలాగే దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకా ఆ తరువాత బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత ఉప్పును కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని దగ్గర పడే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని 4 నుండి 5 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. కానీ తాజాగా, గోరు వెచ్చగా తీసుకుంటేనే మనం చాలా మంచి పలితాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: