సీజన్ మారే కొద్దీ మన శరీరంలో కూడా చాలా మార్పులు వస్తుంటాయి.. ముఖ్యంగా చల్లని నీరు లేదా వేడినీరు తాగినప్పుడు గొంతులో సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి.. గొంతు నొప్పి రావడానికి ఇన్ఫెక్షన్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.. గొంతు బొంగురుగా పోవడం లేకపోతే వాచినట్టుగా అనిపించడం వంటివి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తీసుకున్న ఆహారాన్ని కూడా మింగలేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.. అయితే గొంతు నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించడం కంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

1). గొంతు నొప్పి నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఉప్పునీరు బెస్ట్ ఆప్షన్.. ఈ ఉప్పునీటిని పుక్కిలించడం వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ త్వరగా నయం అవుతుంది.. ఎందుకంటే ఉప్పులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి.


2). మనం తాగేటువంటి పాలలో కాస్త పసుపును కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారు ఈ పసుపు పాలన తాగడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు..

3). కాస్త గోరువెచ్చని నీటిలో పసుపును వేసి ఆ నీటిని పుక్కిలించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని అందుకోవచ్చు ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేస్తే గొంతు నొప్పి గొంతులో ఉండే వాపు కూడా పోతుందట.



4). గొంతు నొప్పి లేదా వాపు ఉన్నవారు హాజరు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.. వేడి నీటిలో కాస్త పసుపుని వేసి ఆవిరి పెట్టడం వల్ల గొంతు సమస్యలను తగ్గించుకోవచ్చు.

5). చామంతి పూలతో చేసేటువంటి టీను తాగడం వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ నొప్పి నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు చాలా మేలు చేస్తాయి. కళ్ళు ముక్కు గొంతువాపు నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: