అమెరికాలో చాలా మంది కూడా కామన్ గా బాధపడేది ఏ సమస్యతో తెలుసా? అదే మలబద్ధకం. ఈ సమస్యకి కారణం వారు తినే ఫుడ్. అమెరికాలో పిజ్జా, గొడ్డు మాంసం చాలా కామన్ గా తింటూ ఉంటారు.పిజ్జాతో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిజ్జాని అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా హెల్త్ పాడవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ పిజ్జా ఎక్కువగా తినడం వల్ల ముందుగా వచ్చే అతి పెద్ద సమస్య మలబద్ధకం..ఎందుకంటే పిజ్జా కోసం వాడే మైదా సరిగా జీర్ణం కాదు. ఒక స్లైస్ చీజ్ పిజ్జాలో 400 కెలరీలు ఉంటాయి.అందువల్ల వేగంగా బరువు పెరిగిపోతారు. రిఫైన్డ్ ఫ్లోర్తో తయారు చేయడంతో పిజ్జా చాలా హెవీగా ఉంటుంది. ఏ పని చేయలేకపోతాము. అయితే.. పిజ్జాని అప్పుడప్పుడు తింటే ఏమి కాదు కానీ దానిని ఎక్కువగా తింటే మాత్రం ప్రమాదకరం.అలాగే ఎక్కువగా పిజ్జా తినడం వల్ల వచ్చే సమస్యలలో మధుమేహం ఒకటి. పిజ్జా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి క్రమంగా డయాబెటిస్‌గా మారుతుంది.


పిజ్జా వంటి అధిక కొవ్వు ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దానికి తోడు బరువు విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ఇతర సమస్యలు కూడా పెరుగుతున్నాయి.పిజ్జా తినడం వల్ల వచ్చే మరో ప్రమాదకరమైన వ్యాధి గుండెపోటు. మాంసాలతో తయారు చేసిన పిజ్జా తింటే, అది ఊబకాయం, కొన్ని క్యాన్సర్, గుండె సమస్యలను కలిగిస్తుంది. ఈ ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తినడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.పిజ్జాలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ అలాంటి పిజ్జా తింటే, అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. మీరు ఒకేసారి మొత్తం పిజ్జా తింటే, మీరు మీ రోజువారీ సోడియం తీసుకోవడం అధికంగా చేస్తున్నారని అర్థం. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను కలిగిస్తుంది.కానీ పిజ్జా వరల్డ్ ఫేమస్ ఫుడ్ అయిపోయింది.పిజ్జాని చాలా మంది ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ అది చాలా దారుణమైన జంక్ ఫుడ్. టేస్టీకి చాలా మంచిది కానీ హెల్త్ కి ఏమాత్రం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: