గంజి నీరుని చాలా మంది వేస్ట్ చేస్తారు. కానీ ఈ నీరు మనకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ గంజి నీరు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేశ సంరక్షణలో రైస్‌ వాటర్‌ ఉపయోగించేందుకు ఒక కప్పు గంజి నీటిలో 20 గ్రాముల మెంతులు అవసరం. రాత్రంతా గంజి నీటిలో మెంతులు నానబెట్టాలి.ఆ ఉదయం మెంతులను వేరు చేసి గంజిని స్ప్రే బాటిల్‌ పోసుకుని జుట్టు మీద స్ప్రే చేసుకోవాలి. లేదంటే, ఆ గంజినీటిని మొత్తం తలకు పట్టేలా బాగా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. కేవలం గంజి నీటిని మాత్రమే తలకు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. జుట్టు పెరుగుదలను  ప్రోత్సహిస్తుంది.విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న గంజి నీరు చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. గంజిలో అల్లాంటన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను నివారిస్తాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల..రంధ్రాలను క్లెన్స్ చేసి.. చర్మాన్ని బిగుతుగా మార్చి, కాంప్లెక్షన్ ని పెంచుతుంది.


గంజి నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంతోపాటు మొటిమలు రాకుండా ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టి, చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. విటమిన్ల లోపం రాకుండా చూసుకోవచ్చు. పిల్లలకు గంజి తాగిస్తే చాలా మంచిది. వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటిని అయినా తాగించాలి. దాంతో వారికి కావల్సిన ఆహారం అంది శక్తి లభిస్తుంది. పోషణ సరిగ్గా ఉంటుంది. విరేచనాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి గంజి నీళ్లు ఎంతగానో సహాయం చేస్తాయి. అందుకే గంజి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. గంజి నీళ్లలో ఎక్కువ మొత్తంలో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: