సాధారణంగా మన దేశంలో నిత్యవసరంల ధరలు పెరిగితే ఎక్కువగా ఐదు నుంచి పది వరకు పెరుగుతాయి.  మహా అంటే 10 నుంచి 20 ఇంకా కష్టం అంటే 30 రూపాయలు . ఇలానే పెరుగుతూ ఉంటాయి . చక్కర - కందిపప్పు - పెసరపప్పు - మినప్పప్పు - నూనె ఇలాంటి ధరలు 10 నుంచి 20 లోపే పెరుగుతాయి తప్పిస్తే ఎక్కడ వందలకు వందలు పెరిగిపోవు . ఎక్కువగా మనదేశంలో పెరిగేది నూనె ధరలు మాత్రమే . మిగతా ధరలన్నీ కూడా కొంచెం కొంచెం గానే పెరుగుతూ 10 - 20 వ్యత్యాసమే కనిపిస్తూ ఉంటాయి . కానీ ఒక దేశం లో మాత్రం 100 దాటి వేలల్లోకి వెళ్లిపోయింది . కేవలం అది కూడా ఒకే ఒక్క యుద్ధం కారణంగా .


ఒక్క యుద్ధం వారి జీవితాలనే మార్చేసింది . ఎస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇజ్రాయిల్ - హమాస్ ఆధిపత్య పోరులో గాజా ప్రాంతం అటుడికి పోయిన విషయం అందరికీ తెలిసిందే . యుద్ధం కారణంగా అక్కడ నిత్యవసరాల ధరలు సాధారణ కంటే ఒకటి రెండు కాదు ఐదు వందల రెట్లు పెరిగిపోయాయి . తాజాగా మన దేశంలో ఐదు రూపాయలకు దొరికే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ గాజాలో మాత్రం 2300 కు చేరింది అంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు . కేవలం ఒక బిస్కెట్ ప్యాకెట్ ధర కాదు ప్రతి ఒక్క నిత్యవసరల ధర భారీగా పెరిగిపోయాయి .



మరీ ముఖ్యంగా బక్రీద్ పండుగ కారణంగా ఆ నిత్యవసరల ధరలు ఇంకా ఇంకా పెరిగిపోయాయి . ముస్లింలకు బక్రీద్ పండుగ ఎంత ప్రత్యేకమైనదో సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  గాజాలోని ప్రజలు పండగ రోజున సంతోషంగా జరుపుకునే పరిస్థితి కూడా లేదు . ఇజ్రాయిల్ హమాస్  మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు ఫలించకపోవడంతో అక్కడ ప్రజలు మసీదులో కాకుండా రోడ్లపైనే ఇళ్లల్లో స్కూల్లో మతపరమైన సంస్థల వద్ద ప్రార్థనలు చేసుకుంటూ వచ్చారు. అంతేకాదు గాజాలో నిత్యవసర ధరలు వందల రెట్లు పెరిగిపోయాయి . ప్రస్తుతం ఇజ్రాయిల్ కరెన్సీ షకీల్  ప్రకారం భారత కరెన్సీ చూస్తే ఒక్క షకిల్ 24 రూపాయలతో సమానంగా చెబుతున్నారు.



అంటే దీనిబట్టి పరిశీలిస్తే ఒక లీటర్ నూనె ధర అక్కడ 4177 రూపాయలు . కేజీ చక్కర దగ్గర 4900 . ఇక పాల పౌడర్ ద్వారా 860.  ఉప్పు ధర 491 . మాంసం 737 . కేజీ టమోటా వెయ్యి రూపాయలు పైనే ఉంది.  ఇక ఉల్లిగడ్డలు - ఆలూ అయితే 2000 క్రాస్ చేసేసాయి . మరోవైపు ఉద్యోగ ఉపాధి లేని గాజా లాంటి ప్రాంతాలలో ఇలాంటి ధరలు ఊహించలేదని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతే త్వరలోనే నిత్యవసరాలు ధరలు మరింత రేట్లు పెరిగిపోయే అవకాశం కూడా ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: