
తులసిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి.1 స్పూన్ చందనం పొడి, 1 స్పూన్ తులసి ఆకుల పేస్ట్ తీసుకోండి. కొన్ని చుక్కలు లెమన్ జ్యూస్ వేసి పేస్ట్ చేయండి.ముక్కుపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. చందనం చర్మాన్ని తడి చేసి, తులసి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. రంధ్రాలు బాగా శుభ్రం అవుతాయి. సమపాళ్లలో ఉప్పు మరియు కొబ్బరి నూనె కలపండి. ముక్కుపై రింగుల్లా మృదువుగా మసాజ్ చేయండి – 5 నిమిషాలు. తరువాత గోరువెచ్చని నీటితో కడగండి. ఉప్పు మృత కణాలను తొలగించి, బ్లాక్ హెడ్స్‌ను మెల్లగా తొలగిస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని పుష్కలంగా తడిచేస్తుంది 1 స్పూన్ బేసన్, చిటికెడు కస్తూరి మంజళి, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయండి.
ముక్కుపై అప్లై చేసి పూర్తిగా పొడిగా అయ్యేవరకు ఉంచాలి. ఆ తరువాత తడిగా చేసి గోరువెచ్చని నీటితో మసాజ్ చేస్తూ తీయాలి. ఇది బ్లాక్ హెడ్స్ తో పాటు వైట్ హెడ్స్ కూడా తొలగించడంలో సహాయపడుతుంది. కురుపులు, చర్మం ముడతలు కూడా తగ్గుతాయి. నిమ్మరసం + తేనె మిశ్రమం, 1 స్పూన్ తేనె + 1 స్పూన్ నిమ్మరసం కలిపి ముక్కుపై అప్లై చేయండి. 10–15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. నిమ్మరసం బ్లాక్ హెడ్స్‌ను సడలించగా, తేనె చర్మాన్ని శుభ్రం చేసి మృదుత్వాన్ని ఇస్తుంది.