ఒక్కోసారి సినిమా అవకాశం ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఒకొక్కరికి అవకాశం దక్కినట్టే దక్కి చేజారనూ వచ్చు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కాల్షీట్ల సమస్య కావొచ్చు, కథలో మార్పులు, పాత్ర తీరుతెన్నుల్లో మార్పులు కావొచ్చు. ఇలా అవకాశాలు వదులుకున్న వారూ.. మరొకరు ఆ అవకాశాలను దక్కించుకున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో అటువంటి అవకాశాన్నే హీరోయిన్ నివేధా పేతురాజ్ చేజార్చుకుందని తెలుస్తోంది. మెగా హీరో చేయబోతున్న ఆ సినిమాలో మొదట ఆ హీరోయన్ నే అనుకున్నారు. కానీ.. ఇప్పుడు హీరోయిన్ మార్పు జరిగిందని తెలుస్తోంది.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమంతో ఆ సినిమా షూటింగ్ గతంలోనే ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఆ సినిమా ప్రారంభమైంది. తొలి షాట్ లో సాయిధరమ్ తేజ్ తోపాటు పాల్గొన్న నివేధా పేతురాజ్ ఇప్పుడు ఆ అవకాశాన్ని వదులుకుందని తెలుస్తోంది. కాల్షీట్లు సర్దుబాటు చేయలేక పోయిందని తెలుస్తోంది. గతంలో కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కావడంతో ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్ గా టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది.

దీనిపై టీమ్ నుంచి అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. సాయిధరమ్ తేజ్ తో నివేధా పేతురాజ్ చిత్రలహరి సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ కాకపోయినా చాలా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో నటించింది నివేధా. తెలుగులో బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురములో సినిమాల్లో నటించింది. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో వరుస సక్సెస్ ల్లో ఉన్న సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 14వ సినిమా ఇది. భగవాన్, పుల్లారావు నిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: