యూనివర్సల్ నటుడు అయిన కమల్ హాసన్ తనయి గా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అందాల భామ అయిన శృతిహాసన్. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఇండస్ట్రీ లోకి ప్రవేశించింది.శృతి హాసన్ అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా రోజుల వరకు సరైన విజయం మాత్రం అందుకులేక పోయింది. అదే సమయంలో టాలీవుడ్ టాప్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా భారీ ఛాన్స్ కొట్టేసింది శృతి హాసన్. ఈ సినిమా సూపర్ విజయం అందుకోవడంతో ఒక్కసారిగా శృతి హాసన్ చాలా బిజీ హీరోయిన్‌గా మారిపోయిందని సమాచారం. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుసగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని సమాచారం. శృతిహాసన్ నటించిన సినిమాలు చాలా వరకుభారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచినట్లు సమాచారం.ఆతర్వాత తమిళ్‌ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ అల్లరిస్తుందట. ఆ తర్వాత శృతిహాసన్ ప్రేమలో పడటం అలాగే ఆ ప్రేమ విఫలం అవ్వడంతో ఆమె చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది.

ఆ తర్వాత తెలుగులో ఇటీవల మాస్ మహా రాజా అయిన రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తిరిగి మళ్ళీ సినిమాలలోకి వచ్చిన శృతి హాసన్సినిమా భారీ విజయంతో మళ్ళీ పవర్ స్టార్ కమ్ బ్యాక్ చిత్రంలో నటించి మెప్పించింది.ఇప్పుడు శృతి హాసన్ వరుస సినిమాలతో చాలా బిజీగా మారినట్లు సమాచారం . ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌తో కలిసి ఆమె సలార్ సినిమాలో నటిస్తోందట. ఇదిలా ఉంటే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుందట. రకరకాల ఫోటో షూట్స్‌ మరియు సినిమా అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటుందట శృతిహాసన్. తాజాగా తన తండ్రి కమల్ హాసన్ తో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిందట ఈ హాట్ బ్యూటీ. తండ్రి కమల్ హాసన్‌తో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసిందట శృతిహాసన్.కమల్ హాసన్ తన తండ్రి మాత్రమే కాదు తనకు బాగా ఇష్టమైన హ్యూమన్ అంటూ రాసుకొచ్చిందట . ఇప్పుడు ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: