ఫోక్ సింగర్ మంగ్లీ అంటే తెలియని వారంటూ ఉండరు. రెండు తెలుగు రాష్ట్రలల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ లేటేస్ట్ సింగింగ్ సెన్సేష‌న్. తెలుగులో సినీ రంగంలోనే కాకుండా అటు సోషల్ మీడియా లోనూ ..యూ ట్యూబ్ లోనూ.. ఇటు స్మాల్ స్క్రీన్ పైన కూడా ఫోక్ సింగ‌ర్‌గా మంగ్లీ సృష్టించిన సంచ‌ల‌నాలు బోలెడు. అమ్మడుకి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది..ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. యూ ట్యూబ్ లో మంగ్లీ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. హిట్ అయ్యే పాటను మంగ్లీ పాడుతుందా లేక ఆమె పాడితేనే ఆ పాట హిట్ అవుతుందో తెలియదు కానీ..మంగ్లీ పాడిన ప్రతి పాట  అభిమానులకు బాగా రీచ్ అవుతూ..సినిమా ఫ్లాప్ అయిన ఆమె పాట మాత్రం బాగా హైలెట్ గా నిలుస్తుంది.

మంగ్లీ ఏ సాంగ్ పాడినా కూడా యూ ట్యూబ్‌లో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకుని ఓ ట్రెండ్ సెటర్ గా నిలుస్తుండడం చూస్తుంటే ఆమె వాయిస్ కి మనవాళ్ళు ఎంతలా ఫిదా అయ్యారో అర్ధంచేసుకోవచ్చు. మంగ్లీ అన్నా  ఆమె పాట అన్నా  నచ్చని జనం ఉండారు అనడంలో సందేహం లేదు. ఆమె పాటల్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే..మంగ్లీ ఏదైనా పాట పాడుతుంటే మనకు తెలియకుండానే మనం డ్యాన్స్ చేసేయగలం.. అలాంటి స్పెషల్ అట్రాక్షన్స్ తో మనకు ఊపు తెప్పిస్తాయి మంగ్లీ పాటలు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం బట్టి మంగ్లీ కి అభిమానుల నుండి సెల్ఫీ సెగ తగిలింది అని తెలుస్తుంది. ఏపీలోని ఒంగోలులో ఓ ప్రైవెట్ కార్యక్రమానికి హాజరైన మంగ్లీకు ఆమె అభిమానులు సెల్ఫీ పేరుతో చుక్కలు చూయించారు.  ప్రోగ్రామ్‌ అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్తున కరమంలో మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు అభిమానులు ఆమె పైకి ఎగబడ్డారు. దీంతో ఇబ్బందిగా ఫీల్ అయిన మంగ్లీ అసహనం తో ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు..తన అసిస్టెంట్‌పై కూడా అరుస్తూ.." బండి తీయ్‌.. ఫోన్‌ చెయ్‌రా దరిద్రుడా".. అంటూ కోపడ్డింది. ప్రస్తుతం మంగ్లీకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. 



 

మరింత సమాచారం తెలుసుకోండి: