విజయ్ దేవరకొండ ఇప్పుడు పెద్ద దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ ను కొనసాగిస్తున్నాడు. మొదట్లో కొత్త దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ దర్శకులతో సినిమా చేస్తూ ఉండడం ఆయన అభిమానులను ఎంతో ఆనంద పరుస్తుంది. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా చూడొచ్చు అభిమానుల ఆశ రోజురోజుకు నిరాశ అవుతుందనే చెప్పాలి.

వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పటికే మొదలు కావాల్సి ఉంది. కానీ పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడం మొదటి భాగం షూటింగ్ లేట్ కావడం వల్ల ఈ సినిమా రోజురోజుకు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు రెండవ భాగం సినిమాను కూడా పూర్తి చేసి దాన్ని విడుదల చేసి విజయ్ సినిమాను మొదలు పెట్టడు సుకుమార్. దాంతో ఈ సినిమా చూడాలని అభిమానులు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయగా  వారు ఈ సినిమాను రెండు సంవత్సరాలకు గానీ చూడలేకపోతున్నారు కాబట్టి వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం వారి వంతు అయ్యింది.

జోనర్ ఎలాంటిదో తెలియకుండానే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తప్పకుండా ఈ సినిమా సుకుమార్ స్టైల్ లో విజయ్ దేవరకొండ స్టైల్ లో కలిసి ఉంటుందని చెబుతున్నారు. తాజాగా సుకుమార్ జన్మదినం సందర్భంగా ఆయనను కలిసిన విజయ్ దేవరకొండ ఓ ఫోటో ని విడుదల చేసి మీతో సినిమా చేయడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉందో లేదో అన్న అనుమానం నేపథ్యంలో ఈ యొక్క పోస్టు సినిమా ఉంది అని తెలపడానికి ఉదాహరణ గా మారింది. మరి పుష్ప సినిమాను పూర్తి చేసి సుకుమార్ విజయ్ దేవరకొండ తో చేతులు కలపబోతున్నాదన్న మాట. ఈలోపు శివ నిర్వాణ సినిమా చేయనున్నాడు విజయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: