తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరోయిన్లలో సాయి పల్లవి గురించి కూడా పెద్దగా పరిచయం చేయనవసరం లేదు ఎందుకంటే ఈమె తన అందంతో, నటనతో, డాన్స్ తో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తు ఉన్నది. ఇక అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం పుష్ప సినిమా పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది రెండో భాగంలో చాలా కొత్త పాత్రలు కూడా కనిపించబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి మొదటి భాగానికి కొనసాగింపు అయినా సుకుమార్ సినిమాని ఎలా తెరకెక్కిస్తారని అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. ఇప్పటికే మొదటి భాగంలో నటించిన శ్రీవల్లి పాత్ర రెండవ పార్టులో చనిపోతుందని వార్త బాగా వైరల్ గా మారుతోంది. దీంతో మరొక హీరోయిన్ కూడా కనిపించబోతోంది అన్నట్లుగా ఎక్కువగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోని ఇప్పటికే సాయి పల్లవి పేరు కూడా బాగా వినిపించింది అలాగే మరికొన్ని బలమైన పాత్రలు సైతం తెరపైకి కనిపించబోతున్నాయని టాక్ కూడా బాగా వినిపిస్తోంది.


మరి ఇందులో ఏది వాస్తవం అన్నది ఇంకా క్లారిటీ రావడంలేదని చెప్పవచ్చు అయితే ఇప్పుడు తాజాగా పుష్ప సినిమాలో మరొకసారి సాయి పల్లవి పాత్ర ఉండబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా చిత్తూరు జిల్లాలోని అడవుల్లో నివసించి గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఇక అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఇమే తో కొత్త ప్రేమాయణం మొదలు పెడతారని సమాచారం. అయితే ఈ సినిమాలో ఈ పాత్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం ఎలాంటి మేకప్ లేకుండా సుకుమార్ సాయి పల్లవని చూపించబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పై అధికారికంగా చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: