గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన గ్రాండ్ గ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది.

దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకొని మంచి కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసిన పొన్నియన్ సెల్వన్ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాక పోతే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో రెంట్ పద్ధతి లో అందుబాటు లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో  పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రస్తుతం తమిళ్ ,  తెలుగు , కన్నడ ,  మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీ ని ఈ భాషలలో చూడాలి అంటే 199 రూపాయలు అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థకు చెల్లించినట్లు అయితే ఈ సినిమాను చూడొచ్చు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని , మంచి కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన పొన్నియన్ సెల్వన్ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష  ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: