టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఒకప్పుడు ఎంత  రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా చేయాలి అంటే నిర్మాతలు కచ్చితంగా 50 కోట్ల వరకు ఇవ్వాలని తెలుస్తోంది. అయితే మొదట పవన్ కళ్యాణ్ కి అల్లు అరవింద్ చాలా తక్కువ పారితోషకం ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా వరకు వరుస విజయాలతో దూసుకుపోయాడు. పవన్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఫుల్ బిజీ అయ్యాడు. ఇక ఆయన నటించిన తొలి సినిమాలో హీరోయిన్గా కూడా అక్కినేని సుప్రియను తీసుకొని మెగా మరియు అక్కినేని కుటుంబాల అభిమానలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 

ఇక ఆ రోజుల్లో ఈయన చేసిన ప్రమోషన్స్ చూసి అందరూ షాక్ అయ్యేవారు. పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ ఉంచేవారు. సినిమా విడుదల అనంతరం ఇతడే మన పవన్ కళ్యాణ్ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేగేది దాని అనంతరం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా మొదట్లో కూడా ఇతడే మనకు కావలసిన పవన్ కళ్యాణ్ బాబు అంటూ చెప్పేవారు. ఇలా ప్రతి విషయంలో కూడా పవన్ ను అద్భుతంగా ప్రమోట్ చేసేవారు. ఇక సినిమాలలో పవన్ చేసే ఫీట్స్ కూడా ఎంతో ఆకర్షణగా నిలిచేవి.ఇక అప్పట్లో ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన రంభ కూడా ఓ ఐటమ్ సాంగ్ లో నటించిన జరిగింది.

అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటులు ,కమెడియన్స్ అంతా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఈ సినిమా యావరేజ్ అయినప్పటికీ పవన్ కెరియర్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.అయితే ఈ సినిమాకి గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్  తీసుకున్నాడు. షూటింగ్ జరిగినన్ని రోజులు నెలకు 5000 రూపాయలు తీసుకున్నాడట పవన్.అయితే అప్పటికి పవన్ కళ్యాణ్ ఎవరికీ తెలియదు. దానితో  చాలా తక్కువ పారితోషకమే తీసుకున్నాడు. 5000 రూపాయలతో రెమ్యూనరేషన్ తీసుకోవడం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్  ఇప్పుడు ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా తీసుకున్న కమ్యూనరేషన్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: