టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక పేరును తెచ్చుకుంది రష్మిక మందన. కిరిక్ పార్టీ అనే సినిమాతో శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దాని అనంతరం సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మిక. ఇక్కడ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈమె. అయినప్పటికీ బాలీవుడ్లో అంత సక్సెస్ను అందుకోలేకపోయింది. ఇటీవల తమిళ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి సరసన హీరోయిన్గా నటించిన

 వరిసు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఈనెల 11 తమిళంలో తెలుగులో జనవరి 14న విడుదలైంది. ఇందులో భాగంగానే డైరెక్టర్ వంశీ పైడిపల్లి రష్మికతో తమిళ మీడియాకు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను ఇవ్వడం జరిగింది. కానీ తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి విజయ్ పెద్దగా పట్టించుకోలేదు అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే విజయ్ తెలుగు వర్షన్ లో ఇంటర్వ్యూలలో పాల్గొనప్పటికీ రష్మిక మందన అయిన కూడా వారసుడు సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో తెలుగు వర్షంలో పాల్గొంటుందని చాలామంది భావించారు.

కానీ అందరూ భావించినట్లుగా అది జరగలేదు. తెలుగు వర్షన్ లో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక మందన ముఖం చాటేసింది. అయితే దీనికి బలమైన కారణం కూడా ఉంది అని తెలుస్తుంది. రష్మిక మందన గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ తో కలిసి తిరుగుతుంది. ఇటీవల వాళ్ళిద్దరూ కలిసి మాల్దీవులకు కూడా వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే ఇందులో భాగంగానే ఈ విషయంపై తెలుగు మీడియా ఈ విషయంపై ఆమెని అడుగుతుందేమో అని ఈ విషయాల క్లారిటీ గురించి రష్మిక మందలని ప్రశ్నిస్తుంది ఏమో అని రష్మిక మందన ముఖం చాటేసిందే అన్న కామెంట్లు సిద్ధం వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: