ఈ రోజు ఉదయం టాలీవుడ్ హీరో శర్వానంద్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక మంచి వార్తను అభిమానులకు మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియచేశారు. గత కొంతకాలంగా శర్వానంద్ పెళ్లి అప్పుడు ఇపుడు అంటూ వార్తలు వచ్చిన అసంగతి తెలిసిందే. కానీ అవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే ఈ రోజు మాత్రం శర్వానంద్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ రోజు వీరిద్దరికీ ఇటు కుటుంబాలు, మరియు కొందరి ఇండస్ట్రీ సన్నిహితుల మధ్యన నిశ్చితార్థం జరిగింది. శర్వానంద్ ఒక సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయిన రకాశిత రెడ్డితో తన జీవితాన్ని పంచుకోనున్నారు.

ఈ వార్త తెలిసిన అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు అంతా చాలా హ్యాపీ గా ఫీల్ అవుతన్నారు. ఇక ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, నాగార్జున, శ్రీకాంత్ లాంటి వారు హాజరు అయ్యి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ ఫంక్షన్ కు అందరూ తమ తమ సొంత భార్యలతో రాగా , కానీ హీరో సిద్దార్ధ్ మాత్రం హీరోయిన్ అదితి రావు హైదరీని వెంటబెట్టుకుని వచ్చాడు. ఈ దృశ్యం చూసిన వారంతా అవాక్కయ్యారు, మాములుగా వీరికి పెళ్లి అయి ఉన్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. పెళ్లి కాకుండానే మరొకరి శుభకార్యానికి చెట్టాపట్టాలేసుకుని రావడంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. అందరూ కూడా వీరి మధ్య ప్రేమ ఉందని ఫిక్స్ అయిపోయి సోషల్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ వీరిని అడిగితే మాత్రం అసలు విషయం ఓపెన్ కావడం లేదు. అయితే వీరి మధ్య ఉన్న ఈ బంధం ఎక్కడికి వెళుతుంది, పెళ్లితో ముగుస్తుందా లేదా ఇంతకు ముందు సిద్దార్ధ్ కొందరితో ప్రేమాయణం నడిపి వదిలేశాడు అలా ముగిసిపోతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: