ఇక బాలీవుడ్ స్టార్ హీరోగా కొన్ని సంవత్సరాలుగా దూసుకుపోతున్న షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా 'పఠాన్'. ఈ సినిమాకి బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన హాట్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించింది.ఈ మూవీ జనవరి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 4 సంవత్సరాల తరువాత షారుఖ్ ఖాన్ నటించిన పూర్తి సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి ఇప్పుడు మిశ్రమ స్పందన వస్తోంది.అయినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా ఒక రేంజిలో సత్తా చాటుతోంది.రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఏకంగా రూ.50 కోట్లు రాబట్టింది ఈ సినిమా. పైగా వరుసగా సెలవులు కూడా ఉండడంతో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు నమ్ముతున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించిన న్యూస్ కూడా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ సినిమాకి అదిరిపోయే ఓటీటీ డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ కంపెనీ 'పఠాన్' డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.100 కోట్లు ఆఫర్ చేసిందట. అంత మొత్తం ఆఫర్ చేయడంతో మేకర్స్ డీల్ ఫైనల్ చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమా విడుదలైన మూడు నెలల తరువాతే ఓటీటీ రిలీజ్ అనేది ఉంటుందని అంటున్నారు. అంటే ఏప్రిల్ నెలలో 'పఠాన్' సినిమా డిజిటల్ స్క్రీన్ పై కనిపించే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా మొత్తం 7700 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా. ఇండియాలో మొత్తం 5200 స్క్రీన్స్ కాగా.. ఓవర్సీస్ లో మొత్తం 2500 స్క్రీన్స్ లో విడుదలైంది.ఫస్ట్ డే ఈ సినిమా ఇండియన్ మార్కెట్ లో ఏకంగా రూ.67 కోట్లు రాబట్టింది. విదేశాల్లో మొత్తం రూ.35 కోట్లు సాధించింది. అంటే ఫస్ట్ రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 'కేజీఎఫ్ 2' సినిమా సినిమా అంతకముందు రూ.53 కోట్లతో రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డుని 'పఠాన్' సినిమా బ్రేక్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: