సమంత తిరిగి తన సత్తాను చాటుకోవాలి అంటే ఆమెకు ఒక బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. అలాంటి పరిస్థితులలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా విడుదలకు రెడీ అయిన ‘శాకుంతలం’ పై చెప్పుకోతగ్గ స్థాయిలో అంచనాలు లేవు. ఇప్పటికే ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది.


వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ పూర్తి అయి సంవత్సర కాలం కావస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కు కాకుండా మరొక తేదీకి వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈవిషయం పై గుణశేఖర్ కూడ స్పష్టమైన క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో ఈ మూవీ వాయిదా పడటం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి.


సినిమా ఇలా వాయిదా పడటానికి బయటకు వస్తున్న కారణాలు మాత్రం కొంతవరకు ఆశ్చర్యంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఫిబ్రవరి 17న ఈ మూవీని రిలీజ్ చేస్తే హిందీ మాట్లాడే రాష్ట్రాలలో ‘శాకుంతలం’ మూవీకి సరైన ధియేటర్లు దొరకవు అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీ విడుదల వాయిదా వేసారు అని అంటున్నారు. ‘పఠాన్’ జోరు చూసి ఈనెల 10న రావాల్సిన ‘షెజాదా’ను 17కు మార్చడంతో ‘శాకుంతలం’ కు ఉత్తరాదిన థియేటర్ల సమస్య తలెత్తి వాయిదా పడింది అని అంటున్నారు. వాస్తవానికి ‘శాకుంతలం’ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో అంతంత మాత్రంగా క్రేజ్ ఉంది. అలాంటిది హిందీ బెల్ట్ లో ఈమూవీకి ఏస్థాయిలో క్రేజ్ ఉందని ఊహించుకుని అనవసరంగా ఫిబ్రవరి 17 డేట్ ను వదులుకున్నారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


అంతేకాదు హీరోయిజం మాస్ టచ్ ఉన్న సినిమాలను మళ్ళీ విపరీతంగా చూస్తున్న పరిస్థితులలో పెద్దగా సినిమాల పోటీ లేని ఫిబ్రవరి నెల వదులుకుని విపరీతంగా సినిమాల పోటీ ఉన్న సమ్మర్ రేస్ ను ‘శాకుంతలం’ ఎంచుకోవడం ఒకవిధంగా గుణశేఖర్ కు అదేవిధంగా సమంతకు మంచిది కాదేమో అన్న సందేహాలను కొందరు వ్యక్తపరుస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: