
ఎవరి రంగాల్లో వారు లెజెండ్స్ గా ఎదిగారు అని చెప్పాలి. కానీ ఇండస్ట్రీలో లెజెండ్స్ గా కొనసాగుతున్న వీరు వరుసకు సోదరులు అవుతారు అన్న విషయం చాలామందికి తెలియదు. మొదట కె విశ్వనాథ్ ఇండస్ట్రీకి రావాలనే ఆసక్తి ఉండేది కాదట. కానీ ఆయన తండ్రి వాహిని స్టూడియోస్ లో పనిచేస్తూ ఉండటం వల్ల ఆయన మాట కాదనలేక సౌండ్ రికార్డింగ్ అసిస్టెంట్ గా మొదట చేరి ఇక తర్వాత దర్శకత్వ విభాగంలోకి రావడం చక చక జరిగిపోయాయి. ఆత్మగౌరవం అనే సినిమాను నాగేశ్వరరావుతో తీశారు కే విశ్వనాథ్.
అయితే కే విశ్వనాథ్ తండ్రికి ఇద్దరు భార్యలు మొదటి భార్య చనిపోవడంతో పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్య చెల్లెలి కొడుకు చంద్రమోహన్ కావడం గమనార్హం. ఇలా కే విశ్వనాథ్ చంద్రమోహన్ సోదరులు అవుతారు అని చెప్పాలి. అయితే చంద్రమోహన్ బావమరిది చెల్లిని బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇలా బాలసుబ్రమణ్యం చంద్రమోహన్ కూడా బంధువులుగా మారారు. అయితే ఇండస్ట్రీలో స్థిరపడిన తర్వాత వీరి ముగ్గురు కూడా బంధువులు అవుతారు అన్న విషయం తెలుసుకున్నారట ఈ ముగ్గురు సెలబ్రిటీలు. ఇక చెన్నైలో చంద్రమోహన్,కే విశ్వనాథ్ పక్కపక్కన ఇల్లు కట్టుకొని ఉండేవారట.