జూనియర్ ఎన్టీఆర్ మరియు తారకరత్నల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది తారకరత్న ని జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావడానికి ప్రోత్సహించారని అంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఇండస్ట్రీలో తొక్కేయడానికి నందమూరి ఫ్యామిలీ ఆయనకు పోటీగా ఇండస్ట్రీకి తీసుకువచ్చింది ఆయనే అని చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలు పై గతంలో తారకరత్న బతికున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.. అసలు మా ఇద్దరి మధ్య అలాంటి బేధాభిప్రాయాలు లేవు అని నాకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నందమూరి ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసి ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది అని.. జూనియర్ ఎన్టీఆర్కి పోటీగా నన్ను తీసుకురాలేదు అని.. మా కుటుంబంలో మా తాత గారి తర్వాత బాబాయి బాలకృష్ణ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు అని..

దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే అంత పేరు వచ్చింది అని.. తన మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు అని.. నందమూరి కుటుంబం నుండి ఒకరు ఈ స్థాయికి ఎదిగారు అంటే అది మా అందరికీ ఎంతో గర్వకారణం అని.. దానికి మేమందరం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని అంతేకాదు నేను నా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నెలకు నాలుగు లక్షల రూపాయలకు పైగానే ఎవరికీ తెలియకుండా ఇచ్చాడు అని.. అలాంటి మంచి అనుబంధం మా ఇద్దరి మధ్య ఉంది అని.. గతంలో తారకరత్న బ్రతికున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

తారకరత్న బతికున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలని అనుకున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి మంచి  నిర్ణయం తీసుకున్నావు అన్నయ్య అంటూ నాకు చెప్పాడు. ఆ మాటలు విన్న నేను ఆనందిస్తూ తమ్ముడు నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి అని కోరాను.. తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నది నువ్వు సీఎం కావడం మాత్రమే నువ్వెప్పుడూ ముఖ్యమంత్రివి అవుతావు నువ్వు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అంటూ తారకరత్న బ్రతికున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్నే కోరాడట ఇక ఆ విషయం చాలామందికి తెలియదు.. తారకరత్న చివరి కోరిక బహుశా ఇదే అయ్యి ఉంటుంది.. ఈ క్రమం లోనే తారకరత్న ఆఖరి కోరిక ఎన్టీఆర్ తెరుస్తాడా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: