తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అత్యంత ప్రజాధరణ పొందిన హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అనుష్క గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అనుష్క ... దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును దక్కించుకుంది.

బాహుబలి లాంటి భారీ బడ్జెట్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మాత్రం వరుస పెట్టి సినిమాలలో నటించడం లేదు. బాహుబలి సిరీస్ మూవీ లు విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్నా అనుష్క కేవలం ఒకటి రెండు సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... వంశీ ... ప్రమోద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ రోజు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మిసెస్ శెట్టి  మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను కన్ఫామ్ చేస్తూ ఒక పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి లు ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: