తెలుగు సినిమా ఖ్యాతిని మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్పతనం రాజమౌళికి మాత్రమే చెందుతుంది. తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డు స్థాయికి రాజమౌళి తీసుకు వెళ్ళినప్పటికీ అతడు తన దగ్గర పనిచేసే సహాయ దర్శకులను దర్శకులుగా మార్చలేక పోతున్నాడు. గతంలో జక్కన్న దగ్గర పనిచేసిన కొంతమంది దర్శకులుగా మారడానికి ప్రయత్నించి సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలు అన్నీ ఫ్లాప్ లుగా మారాయి.


అయితే దీనికి భిన్నంగా సుకుమార్ శిష్యులు అందరు సక్సస్ ఫుల్ దర్శకులుగా మారుతూ ఉండటంతో సుకుమార్ గురూ జీ గా మారాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకుడు కాకముందు లెక్కల లెక్చరర్. క్లాసులో అతడు పాఠం చెపితే పెద్దగా తెలివితేటలు లేని విద్యార్థికి కూడ మంచి మార్కులు వచ్చేవి అని అంటారు. ఆ టీచింగ్ లక్షణాలు సుకుమార్ కు బాగా వంటపట్టడంతో అతడు దగ్గర పనిచేసిన చాలామంది సహాయ దర్శకులు మంచి దర్శకులుగా మారి సంచలనాలు సృష్టించారు.


‘కుమారి 21 ఎఫ్’ మూవీతో సంచలనం సృష్టించిన సూర్య ప్రతాప్ సుకుమార్ ప్రియ శిష్యుడు. ఇక ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ యూనిట్ అత్యంత కీలకంగా పనిచేసిన సహాయ దర్శకుడు. ‘ఉప్పెన’ లాంటి భారీ సక్సస్ ను అందుకున్న తరువాత కూడ సుకుమార్ ఎదుట నిలబడాలి అంటే బుచ్చిబాబు చాల వినయవిధేయుతలతో చేతులు కట్టుకుని నిలబడతాడు. లేటెస్ట్ గా విడుదలై సూపర్ సక్సస్ సాధించిన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ సుకుమార్ సినిమాలు చూసి ప్రభావితం అయి దర్శకుడుగా మారిన విషయం తెలిసిందే.


లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ తో సినిమా తీస్తున్న శ్రీకాంత్ రెడ్డి కూడ సుకుమార్ శిష్యుడు. ఇలా వీరంతా సక్సస్ ఫుల్ దర్శకులుగా మారడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సుకుమార్ సహకారం ఉంది అని అంటారు. ముఖ్యంగా ఈ దర్శకులు తీసే సినిమాల స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలుచూసుకుని సలహాలు ఇస్తాడు అని టాక్. గతంలో దాసరి నారాయణరావు శిష్యులు ఎంతోమంది దర్శకులుగా మారారు. ఇప్పుడు ఆలోటును ఇండస్ట్రీలో సుకుమార్ భర్తీ చేస్తున్నాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: