సినిమా.. సగటు మనిషికి ప్రస్తుత జీవితంలో ఉన్న వినోదాల్లో ముఖ్యమైంది. సినిమా చూస్తూ జనం నవ్వుతారు.. ఏడుస్తారు.. తెరపై తమను తాము ఆవిష్కరించుకుంటారు.. మూడు గంటలపాటు అన్నీ మర్చిపోయి మరో లోకంలో విహరిస్తారు. అందుకే సినిమా అంటే ప్రజలకు అంత పిచ్చి. 


ఇక రాజకీయ నాయకులు.. ప్రజలకు మేలు చేస్తామంటారు.. రాజకీయాలు చేస్తారు.. అధికారం కోసం సర్వశక్తులూ ఒడ్డుతారు. అయితే సినిమాలు, రాజకీయాలు కలసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలకు కొద్ది నెలల ముందు.. సినీనటులు రాజకీయాల్లోనూ సందడి చేస్తుంటారు. 

ఎన్నికల సందర్బంగా సినీనటులు కూడా రాజకీయ నేతలను మించి ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటారు. ఇటీవల మా ఎన్నికల సందర్బంగా కూడా సినీ నటులు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మా ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు .. ఈ రెండూ ముగిశాయి.

అందుకే ఇకనైనా సినీనటలంతా కలసి మెలసి ఉంటే ప్రేక్షకుడు సంతోషిస్తాడు. ప్రేక్షక దేవుళ్లను వినోదంతో మెప్పించేలా నటీనటులంతా  రాజకీయాలను మరచిపోయి కృషి చేయడం సినీరంగానికీ, ప్రేక్షక లోకానికీ మంచిది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఛాలెంజులు.. ఇలాంటివన్నీ ఎలాగూ రాజకీయ నాయకులు కొనసాగిస్తారు కదా. సినీనటులు వినోదం పంచితేనే అందరికీ ఆనందం. ఏమంటారు..?



మరింత సమాచారం తెలుసుకోండి: