టాలీవుడ్ లో ‘యుగానికొక్కడు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కార్తి. తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న సూర్య తమ్ముడు కార్తి. ‘గజిని’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య తర్వాత సింగం సీరీస్ తో
టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు. తెలుగు లో కార్తీ కూడా వరుస గా తన సినిమాలు రిలీజ్ చేస్తూ మంచి విజయాలే అందుకుంటున్నాడు.
ఆ మద్య రిలీజ్అయిన ‘ఖాకీ’ సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా మరో పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో వచ్చిన కార్తికి ‘ఖైదీ’ సినిమాతో మరో హిట్టును అందుకున్నాడు. ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. తమిళంలోనే కాక తెలుగులోనూన మంచి
మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీ.. చివరగా దేవ్ చిత్రంతో పలకరించాడు. తాజాగా కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన
మూవీ ఖైదీ. పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా కనిపించారు.
ఈ
మూవీ విశేషాలు ఏంటంటే సాంగ్స్ లేకపోవడం. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి
సామ్ సీఎస్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీలో
హీరోయిన్, పాటలు ఏమి లేకుండా అద్భుతంగా నడిపించారు. ఈ మూవీలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ బాగా వర్క్ ఔట్ అయ్యింది. పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా చిత్ర బృదం ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో
సినిమా హైలైట్ సీన్స్ ఉన్నాయి.