తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నాటి తరం హీరోయిన్లు నేటి తరంలో అమ్మ అత్త  పాత్రలను పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దర్శకనిర్మాతలు కూడా నాటి తరం వెటరన్  హీరోయిన్ లను నేటి తరం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోయిన్లకు తల్లులుగా నటింప చేస్తే సినిమాకు కూడా మరింత కలిసొచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక సినిమాలో హీరోహీరోయిన్ల గురించి మాత్రమే కాదు వారికి తల్లి  పాత్రను పోషించే నటుల గురించి కూడా కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ముఖ్యంగా ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా నాటి తరం తరం హీరోయిన్లు అందరూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

 


 ఇలా ఒకప్పుడు తన హవా నడిపించి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి.... అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి తరం హీరోయిన్లు నేటి తరంలో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. హీరోయిన్ అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు నేటి తరం హీరోయిన్లు. ఇలా అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ప్రస్తుతం యువ హీరోలకు తల్లి అత్త  పాత్రల్లో  నటిస్తుంది నగ్మా. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమలో  అప్పట్లో నగ్మా తన అందచందాలతో అభినయంతో నటనతో ఎంతో సెన్సేషన్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించి  ఎంతగానో గుర్తింపు సంపాదించింది . ఇక ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఎన్నో రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపించని నగ్మా  ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అల్లరి బుల్లోడు సినిమాలో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. అల్లరి బుల్లోడు సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కు అమ్మ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాలో ఎంతో పొగరుబోతు తల్లిగా తన నటనతో అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది ఎలా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: